Hrithik Roshan and Saif Ali Khan Starrer Vikram Vedha Movie Trailer Out - Sakshi
Sakshi News home page

Vikram Vedha: ఇద్దరి చెడ్డవారి కథే ‘విక్రమ్‌ వేద’.. ట్రైలర్‌ అదుర్స్‌

Published Thu, Sep 8 2022 4:23 PM | Last Updated on Thu, Sep 8 2022 6:33 PM

Vikram Vedha Movie Trailer Out - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘విక్రమ్‌ వేద’. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్‌ హిట్‌ ‘విక్రమ్‌ వేద’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. పుస్కర్‌, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

(చదవండి: వింత జీవులతో సైనికుల పోరాటం.. ‘కెప్టెన్‌’ ఎలా ఉందంటే?)

‘ప్రతి కథలో మంచీ, చెడూ ఉంటాయి. కానీ  ఇది ఇద్దరి చెడ్డవారి కథ’అంటూ ప్రారంభమమయ్యే ఈ ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో హృతిక్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు తెలిపాయి.  ఈ రీమేక్ చిత్రాన్ని  భారీ బ‌డ్జెట్‌తో రిల‌య‌న్స్ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, టీ-సిరిస్ ఫిలింస్‌, ఫ్రైడే ఫిలిం వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement