OTT And Theatres Release Movies In This Week - Sakshi
Sakshi News home page

OTT, Theatres Releases: ఈ వారం థియేటర్స్‌, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!

Published Mon, Sep 26 2022 7:48 PM | Last Updated on Mon, Sep 26 2022 8:28 PM

OTT And Theatres Release Movies In This Week  - Sakshi

 దసరా సెలవుల్లో వినోదం పంచేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. స్కూళ్లు, కాలేజీలకు వరుస హాలీడేస్ రావడంతో థియేటర్లకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం  ఓటీటీ, థియేటర్లలో రానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి.

ధనుష్‌ నేనే వస్తున్నా: తమిళ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'నానే వరునెన్'. తెలుగులో ఈ సినిమా 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ సినిమాలో ఇలి అవ్రామ్‌, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది.

మణిరత్నం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1: భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో రూపొందించిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ఈ సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 30న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. 

 హృతిక్ రోషన్ మూవీ విక్రమ్ వేద:  బాలీవుడ్‌ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్‌ హిట్‌ ‘విక్రమ్‌ వేద’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది.  ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా.. సీఎస్ సామ్ సంగీతమందించారు.  పుస్కర్‌, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు ఇవే: 

నెట్‌ఫ్లిక్స్‌

  • బ్లోండీ సెప్టెంబరు 28
  • ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి సెప్టెంబరు 30  

జీ5

  •  బుల్లెట్‌ ట్రైన్‌ సెప్టెంబరు 29
  •  కెప్టెన్‌ సెప్టెంబరు 30

సోనీ లివ్‌

  • కోబ్రా సెప్టెంబరు 28
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  •  777 చార్లీ సెప్టెంబరు 30

డిస్నీ+హాట్‌ స్టార్‌

  • కర్మయుద్ధ్‌ సెప్టెంబరు 30
  • హాకస్‌ పోకస్‌ 2
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement