Nene Vasthunna Movie
-
ఓటీటీలోకి ధనుష్ ‘నేనే వస్తున్నా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
తమిళస్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’. ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేసింది. అయితే తమిళంలో హిట్ అయినప్పటికీ.. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్లో అక్టోబర్ 27నుంచి స్ట్రీమింగ్ కానుంది.‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వచ్చిన 4వ చిత్రమింది.ఈ సినిమాలో ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. a war between the light and the shadow ☄ #NaaneVaruvenOnPrime, Oct 27@theVcreations @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @RVijaimurugan @theedittable @saregamasouth pic.twitter.com/i44cdRTfz7 — prime video IN (@PrimeVideoIN) October 22, 2022 -
అల్లు అర్జున్ రిలీజ్.. దూసుకుపోతున్న ధనుష్
-
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!
దసరా సెలవుల్లో వినోదం పంచేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. స్కూళ్లు, కాలేజీలకు వరుస హాలీడేస్ రావడంతో థియేటర్లకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి. ధనుష్ నేనే వస్తున్నా: తమిళ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'నానే వరునెన్'. తెలుగులో ఈ సినిమా 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ సినిమాలో ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1: భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో రూపొందించిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 30న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. హృతిక్ రోషన్ మూవీ విక్రమ్ వేద: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా.. సీఎస్ సామ్ సంగీతమందించారు. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు/ వెబ్ సిరీస్లు ఇవే: నెట్ఫ్లిక్స్ బ్లోండీ సెప్టెంబరు 28 ప్లాన్ ఏ ప్లాన్ బి సెప్టెంబరు 30 జీ5 బుల్లెట్ ట్రైన్ సెప్టెంబరు 29 కెప్టెన్ సెప్టెంబరు 30 సోనీ లివ్ కోబ్రా సెప్టెంబరు 28 అమెజాన్ ప్రైమ్ వీడియో 777 చార్లీ సెప్టెంబరు 30 డిస్నీ+హాట్ స్టార్ కర్మయుద్ధ్ సెప్టెంబరు 30 హాకస్ పోకస్ 2 -
ధనుష్ ‘నేనే వస్తున్నా’నుంచి ‘ఒకే ఒక ఊరిలోనా..’సాంగ్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’సాగే ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ అలపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ‘పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది..పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది’ లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వీరా సూర ధీర రారా.. ఆకట్టుకుంటున్న ధనుష్ పాట
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ‘వీరా సూర ధీర రారా.. మతి బెదర గతి చెదరా..అడవంతా నీ అధికారం ఔరా’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, రాహుల్ నంబియార్ అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.