వీరా సూర ధీర రారా.. ఆకట్టుకుంటున్న ధనుష్‌ పాట | Veera Soora Song Out From Dhanush Latest Film Nene Vasthunna | Sakshi
Sakshi News home page

Nene Vasthunna: వీరా సూర ధీర రారా.. ఆకట్టుకుంటున్న ధనుష్‌ పాట

Published Wed, Sep 21 2022 10:49 AM | Last Updated on Wed, Sep 21 2022 10:54 AM

Veera Soora Song Out From Dhanush Latest Film Nene Vasthunna - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్‌’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు.

‘వీరా సూర ధీర రారా.. మతి బెదర గతి చెదరా..అడవంతా నీ అధికారం ఔరా’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా, రాహుల్ నంబియార్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement