![Radhika Apte To Play A Lawyer In The Vikram Vedha Remake - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/15/Radhika-Apte-New-Collection.jpg.webp?itok=NAhl-MGM)
రాధికా ఆప్టే
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు.
తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment