సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ మీద తలపడనున్నారు. మరి ఎవరు గెలుస్తారు? ప్రస్తుతానికి సస్పెన్స్. 2017లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్ వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి రూపొందించారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో పలువురు హీరోలు నటిస్తారని వార్తలు వినిపించాయి. ఫైనల్‌గా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ఈ రీమేక్‌లో నటించనున్నారు. మాధవన్ పాత్రలో సైఫ్, సేతుపతి పోషించిన పాత్రను ఆమిర్ ఖాన్ చేస్తారట. 2020 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వై నాట్ స్టూడియోస్, నీరజ్‌పాండే, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment