'విక్రమ్ వేదా' టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ | Madhavan, Vijay Sethupathi Starer Vikram Vedha teaser | Sakshi
Sakshi News home page

'విక్రమ్ వేదా' టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్

Published Thu, Feb 23 2017 5:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

'విక్రమ్ వేదా' టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్

'విక్రమ్ వేదా' టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్

కోలీవుడ్ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతిలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్ వేదా. ఇద్దరూ డిఫరెంట్ క్యారెక్టర్స్ను ఎంచుకునే నటులు కావటంతో వారి నుంచి ఎలాంటి చిత్రం రాబోతుందో అన్ని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో విక్రమ్ వేదా టీజర్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలకు అందుకునే స్థాయిలో థ్రిల్లింగ్ టీజర్ను రిలీజ్ చేశారు విక్రమ్ వేదా టీం. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి క్రూరమైన విలన్గా కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే పోరాటమే సినిమా కథగా తెలుస్తోంది. టీజర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిత్రయూనిట్ సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్లతో ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement