బాలీవుడ్‌కు కోలీవుడ్ సూపర్‌ హిట్ | Kollywood Super Hit VikramVedha in Hindi | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 15 2018 11:30 AM | Last Updated on Thu, Mar 15 2018 1:42 PM

Kollywood Super Hit VikramVedha in Hindi - Sakshi

‘విక్రమ్‌ వేదా’ సినిమాలో మాధవన్‌, విజయ్‌ సేతుపతి

విలక్షణ నటులు మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్‌ సూపర్‌హిట్ సినిమా విక్రమ్‌ వేదా. డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు మాధవన్‌, విజయ్‌ సేతుపతి నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులోనే నాగార్జున, రానా, వెంకటేష్‌ లాంటి స్టార్‌ల పేర్లు వినిపించినా.. ఇంతవరకు ఫైనల్‌ కాలేదు.

తాజాగా విక్రం వేదా బాలీవుడ్‌ రీమేక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్‌ తరణ్ ఆదర్శ్‌ త్వరలో విక్రం వేదా రీమేక్‌ పట్టాలెక్కనుందని ప్రకటించారు. రిలయన్స్‌ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ప్లాన్‌ సి స్టూడియోస్‌, వై నాట్‌ స్టూడియోస్‌ ఈ రీమేక్‌ను నిర్మించనున్నాయి. ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్‌ గాయత్రిలే హిందీ వర్షన్‌కు కూడా డైరెక్ట్‌ చేయనున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త‍్వరలోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement