టోక్యో ఫిలిం ఫెస్టివల్‌ కు 'విక్రమ్ వేదా' | VikramVedha at the Tokyo International Film Festival | Sakshi
Sakshi News home page

టోక్యో ఫిలిం ఫెస్టివల్‌ కు 'విక్రమ్ వేదా'

Published Tue, Sep 26 2017 1:13 PM | Last Updated on Tue, Sep 26 2017 2:23 PM

VikramVedha at the Tokyo International Film Festival

విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదా. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ లో జరుగనున్న ప్రతిష్టాత్మక 30వ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ లో విక్రమ్ వేదా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కోలీవుడ్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.

ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించాడు. సినిమా కథా కథనాలతో పాటు క్లైమాక్స్ విషయంలో కూడా చిత్రయూనిట్ కొత్తగా ప్లాన్ చేసింది. ఎలాంటి ముగింపు ఇవ్వకుండా కథను అర్థాంతరంగా ఆపేయటంతో సీక్వల్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement