కోలీవుడ్ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతిలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్ వేదా. ఇద్దరూ డిఫరెంట్ క్యారెక్టర్స్ను ఎంచుకునే నటులు కావటంతో వారి నుంచి ఎలాంటి చిత్రం రాబోతుందో అన్ని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో విక్రమ్ వేదా టీజర్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.