Salman Khan And Kamaal R Khan: Salman Khan Sends Another Legal Notice To Kamaal R Khan - Sakshi
Sakshi News home page

Salman Khan Vs Kamaal R Khan: ‘సల్మాన్‌ ఇంతగా నన్ను లవ్‌ చేస్తున్నాడా!’

Published Tue, Nov 23 2021 8:17 AM | Last Updated on Tue, Nov 23 2021 9:14 AM

Salman Khan Sends Another Legal Notice To Kamal R Khan - Sakshi

Kamaal R Khan Tweet Salman Khan Misses Him: బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్‌ చానల్‌లో ద్వారా వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్‌ చేస్తుంటాడు. సినీ సెలబ్రెటీలను విమర్శించడమే తన పని అన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో అతడు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు వరుసగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

చదవండి: ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?

సల్మాన్‌ నటించిన ‘రాధే’ చిత్రంపై నెగెటివ్‌ రివ్యూలతో మొదలైన ఆయన విమర్శలు సల్లూభాయ్‌ సొంత బ్రాండ్ ‘బీయింగ్‌ హ్యూమన్‌’ దాకా చేరాయి. అదేవిధంగా ‘రాధే’ హీరోయిన్‌ దిశా పటానీని, సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే షారుఖ్‌ ఖాన్‌, గోవిందా తదితర సెలబ్రిటీలపై కూడా ఘాటుగా విమర్శలు గుప్పించాడు కమల్‌. సోషల్‌ మీడియాలో వారికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో కమల్‌ కేసు నమోదు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు సల్మాన్‌. తాజాగా మరోసారి కమల్‌పై సల్మాన్‌ ఫిర్యాదు దాఖలు చేశాడట. 

చదవండి: పునీత్‌ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా

ఈ విషయాన్ని స్వయంగా కమల్‌ తన ట్వీటర్‌లో వెల్లడించాడు. ‘‘సల్మాన్ ఖాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన నన్ను 24/7లో ప్రతి క్షణం నన్ను మిస్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన నాకు మరోసారి కోర్టు నోటీసులు పంపాడు. అయితే ఈ మధ్య నేను సల్మాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వీడియో చేయలేదు. అతను నటించిన ఏ సినిమాకు నేను రివ్యూ ఇవ్వలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కానీ, అతను నాకు వ్యతిరేకంగా మరోసారి కేసు వేశాడు. ఈ కేసు విచారణ నవంబర్ 29న జరగనుంది’ అంటూ తన ట్వీట్‌ రాసుకొచ్చాడు. 

చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement