సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..!
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమా షూటింగ్ ను ప్రారంభించిన డార్లింగ్.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందించే పనిలో ఉన్నాడు. అందుకోసం కొన్ని రిస్క్ స్టంట్స్ కూడా చేస్తున్నాడట. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వన్స్ కోసం స్కూబా డైవింగ్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ లు సంగీతమందిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.