
బాహుబలి ఇంకా చూడలేదు.. కానీ!
టెక్నాలజీ సినిమా స్ధాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని చెప్పడానికి బహుబలి ఓ ఉదాహరణ అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ అన్నారు.
న్యూఢిల్లీ: టెక్నాలజీ సినిమా స్ధాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని చెప్పడానికి బహుబలి ఓ ఉదాహరణ అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ అన్నారు. ధైర్యంతో సాహసం చేయడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. సినిమా బిజీలో ఉండి.. రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి-2 సినిమాను తాను ఇంకా చూడలేదని తెలిపారు.
అయితే, బాహుబలి మొదటి పార్టును చూశానని షారుఖ్ చెప్పారు. అత్యుత్తమ దృష్టి కలిగిన వారు చెక్కిన కళాఖండం బాహుబలి అని కితాబిచ్చారు. రాజమౌళి నిర్మించిన సినిమాలు తనకు ఆదర్శమని చెప్పుకొచ్చారు