
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్‌లో 28 లక్షల డాలర్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా 30 లక్షల డాలర్ల మార్క్‌ను కూడా ఈజీగా సాధిస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే పలు కలెక్షన్ రికార్డ్ లను సొంతం చేసుకున్న రంగస్థలం ఖాతాలో మరో భారీ రికార్డ్ చేరింది. తొలి వారాంతంలో 80 కోట్లకు పైగా షేర్ వసూళు చేసి బాహుబలి 1 తరువాతి స్థానంలో నిలిచిన ఈ సినిమా తమిళనాట మాత్రం బాహుబలి 1 రికార్డ్ లను దాటేసింది. సమ్మె కారణంగా కోలీవుడ్ లో తమిళ చిత్రాలేవి విడుదల కాకపోవటం రంగస్థలంకు కలిసొచ్చింది. తొలి ఎనిమిది రోజులకు చెన్నై నగరంలోనే కోటి రూపాయల షేర్ వసూళు చేసి సత్తా చాటింది రంగస్థలం.
Comments
Please login to add a commentAdd a comment