
రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం రికార్డ్‌ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న రిలీజ్ అయిన రంగస్థలం ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటుతోంది.
రంగస్థలం తరువాత స్టార్ హీరోల చిత్రాలేవి రిలీజ్ కాకపోవటం ఛల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు రిలీజ్ అయినా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవటంతో రంగస్థలం జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ దాటేసిన ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల మార్క్‌ను సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment