
కర్ణాటక నుంచి జాతీయ రిపబ్లిక్ డే వేడుకల్లో మరోసారి బాహుబలి ఢిల్లీ వీధుల్లో విహరించడానికి రంగం సిద్ధమవుతోంది. అదే జరిగితే ఒకనాటి ఆ మహావీరునికి ఈ రికార్డు రెండోసారి దక్కినట్లు అవుతుంది.
బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవం తరువాత, భారత సైనిక, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పే గణతంత్ర దినోత్సవంలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే కవాతులో అన్ని రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించడం ఆనవాయితి. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి శకటాల నమూనాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర రక్షణశాఖకు ఇప్పటికే అందించాయి. ఇక కర్ణాటక కూడా గోమటేశ్వర, కర్ణాటక జీవవైవిధ్యం, డైనమిక్ సిటి బెంగళూరు అనే మూడు నమూనాలను కేంద్ర రక్షణశాఖకు అందజేసింది. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నమూనాలను చరిత్రకారులు, సంగీత, నృత్యకళా నిపుణులు పరిశీలించి ఆ వేడుకలో ప్రదర్శించాల్సిన శకటాలను ఎంపిక చేస్తారు. రాష్ట్రం అందించినవాటిలో గోమటేశ్వర మహామస్తాభిషేక నమూనానే ఎంపిక చేసే అవకాశం ఉంది.
12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించే గొమ్మటేశ్వర మహామస్తాభిషేక కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. అంతేకాకుండా 2005వ సంవత్సరంలో గణతంత్ర వేడుకల్లో మొదటిసారి గోమటేశ్వర మహామస్తాభిషేక శకటం ప్రదర్శనకు అవకాశం కల్పించారు. 14 రాష్ట్రాల శకటాలపైకి రాష్ట్ర శకటం మొదటి స్థానంలో నిలిచి బహుమతిని అందుకుంది. మళ్లీ ఈసారి అదే నమూనాను పంపడం విశేషం. కారణం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న బాహుబలి మహామస్తకాభిషేకాలే