'అతనే ఇండియాస్ బిగెస్ట్ సూపర్ స్టార్'
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్.. రాజమౌళిపై ప్రశంసలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పలు వేదికల మీద బాహుబలి సినిమాను, దర్శకుడి రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసిన కరణ్, తాజాగా మరో సినీ వేదికపై బాహుబలి సినిమా ప్రస్థావన తీసుకువచ్చాడు. శుక్రవారం రాత్రి ఎక్తాకపూర్ నిర్మించిన హాఫ్ గర్ల్ఫ్రెండ్ సక్సెస్ పార్టీలో పాల్గొన్న కరణ్ మరోసారి బాహుబలిపై ప్రశంసలు కురిపించాడు.
అంతర్జాతీయ స్థాయిలో 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి సినిమాతో రాజమౌళి ఇండియాస్ బిగెస్ట్ సూపర్ స్టార్ అవతరించాడన్నాడు. 'నేను నా నిర్మాణ సంస్థ బాహుబలి ప్రాజెక్ట్లో భాగమవ్వటం ఆ గౌరవంగా భావిస్తున్నా.. ఈ ప్రయాణంలో బాహుబలి యూనిట్తో కలిసి నడిచినందుకు గర్వపడుతున్నా' అంటూ మరోసారి బాహుబలి యూనిట్ను ప్రశంసించాడు. హాఫ్ గర్ల్ఫ్రెండ్ యూనిట్కు శుభాకాంక్షలు తెలిపిన కరణ్, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.