అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రభాస్ | Prabhas in a clean shaven look | Sakshi
Sakshi News home page

అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రభాస్

Published Wed, Jun 7 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

Prabhas in a clean shaven look

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సౌత్ సినిమా బాహుబలి. ఈ సినిమాతో దర్శక నిర్మాతలే కాదు.. హీరోగా నటించిన ప్రభాస్ కూడా అంతర్జాతీయ స్థాయి స్టార్గా మారిపోయాడు. అందుకే బాహుబలి తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఏం చేసినా అది న్యూస్ హెడ్ లైన్గా మారుతోంది. తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలిలో పొడవాటి జుట్టు, మెలితిరిగిన మీసం, గడ్డంతో కనిపించిన ప్రభాస్ ఈ ఫోటోలో క్లీన్ షేవ్లో కనిపిస్తున్నాడు.

ఇటీవల ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ హకీమ్ అలీం తన సోషల్ మీడియా పేజ్లో ప్రభాస్ ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. స్టైలిష్ లుక్లో ఉన్న ప్రభాస్ను చూసి ఇది సాహో లుక్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటోలో ప్రభాస్ డిఫరెంట్గా కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ ప్రభాస్ క్లీన్ షేవ్లో కనిపించలేదు. చక్రం లాంటి సినిమాల కోసం గడ్డం తీసేసినా మీసాలు లేకుండా ఇంత వరకు కనిపించలేదు. మరి ఒక్కసారిగా ప్రభాస్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అన్ని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement