
గత ఐదేళ్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేశాడు. భారీగా తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలు పూర్తి చేయడానికి ప్రభాస్ నాలుగేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు. అయితే బాహుబలి తరువాత అయినా డార్లింగ్ వరుస సినిమాలతో అలరిస్తాడనుకుంటే సాహో లాంటి భారీ సినిమాతో మరోసారి ఆలస్యం చేశాడు.
ఈ ఆలస్యాన్ని మరిపించేలా ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సాహో సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కేవలం నాలుగు నెలల గ్యాప్‌తో జిల్ ఫేం రాధకృష‍్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ జాన్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాను ముందుగా 2020 జనవరిలో రిలీజ్ చేయాలనకున్నా.. షూటింగ్ అనుకున్న సమయం కన్నా ముందే పూర్తయ్యే అవకాశం ఉండటంతో డిసెంబర్‌లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేసిన డార్లింగ్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment