బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే చిత్రయూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయినా భారీగా గ్రాఫిక్స్ చేయాల్సి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయా లేదా అన్న భయం నిర్మాతలను వేదిస్తోదంట. ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్టు 15కు ప్రాజెక్ట్ రెడీ కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అవుతుండటంతో ఆగస్టు 15కు మించి మంచి డేట్ దొరకదని అందుకే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయాలని రాత్రి పగలు వర్క్ చేస్తున్నారట. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సాహో సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment