హవ్వా! రాజమౌళి ఎవరా!! | Nikesha Patel: telugu hero insulted baahubali | Sakshi
Sakshi News home page

హవ్వా! రాజమౌళి ఎవరా!!

Published Wed, May 10 2017 11:14 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

హవ్వా! రాజమౌళి ఎవరా!! - Sakshi

హవ్వా! రాజమౌళి ఎవరా!!

...అంటున్నది నికిషా పటేల్‌ కాదు, ఓ తెలుగు నటుడంట! ‘బాహుబలి’తో రాజమౌళి పేరు ఒక్క తెలుగులో ఏం ఖర్మ... తమిళ, మలయాళం, హిందీలతో పాటు విదేశాల్లో కూడా వీర విహారం చేస్తోంది. అలాంటిది ఆయన పేరు, ‘బాహుబలి’కి దర్శకుడు ఆయనే అనేది ఓ తెలుగు నటుడికి తెలీదంటే ఆశ్చర్యమే. కానీ, పవన్‌కల్యాణ్‌ ‘కొమరం పులి’ ఫేమ్‌ నికిషా పటేల్‌ చెబుతున్న మాటలను బట్టి నమ్మక తప్పదు.

ఓ తెలుగు నటుణ్ణి ‘బాహుబలి’ చూశావా? అని నికిషా పటేల్‌ అడిగితే... ‘‘దానికి దర్శకుడు ఎవరు? ఎవరు దర్శకత్వం వహించారు?’’ అని సదరు నటుడు ఎదురు ప్రశ్నించాడట. ‘‘అతడు అంత నిర్లక్ష్యంగా, మూర్ఖంగా ఎలా ఉన్నాడో! అతణ్ణి చూస్తే అసహ్యంగా ఉంది. అతడి పేరు చెప్పడానికి సిగ్గేస్తోంది’’ అని నికిష ట్వీట్‌ చేశారు. ఆ నటుడు ఎవరంటారు? అది మాత్రం చెప్పనంటే చెప్పనంటున్నారు నికిష.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement