
మరో భారీ చిత్రానికి రెడీ : ప్రభాస్
నాలుగేళ్ల సమయం ఓ నటుడి కెరీర్ లో అయిన పెద్ద విషయం. నాలుగేళ్ల పాటు ఒకే సినిమాకు
నాలుగేళ్ల సమయం ఓ నటుడి కెరీర్ లో అయిన పెద్ద విషయం. నాలుగేళ్ల పాటు ఒకే సినిమాకు అంకితమై పోవడానికి ఎవరూ అంగీకరించరు. కానీ ప్రభాస్ ఆ రిస్క్ చేశాడు. కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల పాటు మరో సినిమా అంగీకరించకుండా పని చేశాడు. ఆ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. మరోసారి అలాంటి రిస్క్ చేయనని చెపుతున్నాడు.
అయితే స్క్రిప్ట్ ఆకట్టుకుంటే రెండేళ్ల పాటు ఒకే సినిమా మీద పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదంటున్నాడు డార్లింగ్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా కోసం రెడీ అవుతున్న యంగ్ రెబల్ స్టార్, తరువాత జిల్ ఫేం రాధకృష్ణతో మరో సినిమా చేసే ఆలొచనలో ఉన్నాడు. వీటితో పాటు కొంత మంది బాలీవుడ్ దర్శక నిర్మాతలతోనూ ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.