
తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన భారీ చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ను బాలీవుడ్ స్థాయికి చేర్చింది. రెండో భాగంతో రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి యూనిట్.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.
ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలి సినిమాను ఇప్పుడు రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే చైనాలో బాహుబలి 2ను భారీగా రిలీజ్ చేసేందుకు సిద్ధమైన యూనిట్, అదే సమయంలో భారతీయ భాషల్లో బాహుబలి కొత్త వర్షన్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రెండు భాగాలు కలిపి మూడు గంటలకు ఎడిట్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ రీ-రిలీజ్ లో బాహుబలి ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.