
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అవ్వటంతో సాహోను కూడా అదే స్థాయిలో 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలై ఈ సినిమా మేకింగ్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment