
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ అంటూ సినిమా వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా నిర్మాత దానయ్య ఈ భారీ మల్టీ స్టారర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇన్నాళ్లు సినిమా బడ్జెట్ 100, 150 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు దానయ్య. మహేష్ బాబు హీరోగా దానయ్య నిర్మించిన భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ సందర‍్భంగా ఈ విషయాలను వెల్లడించారు.
‘మల్టీ స్టారర్ సినిమాను కథను రాజమౌళి నాతో పాటు మరికొందరు సాంకేతిక నిపుణులకు చెప్పారు. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాము. సెట్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ పని మొదలు పెట్టారు. సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుంది’ అన్నారు నిర్మాత డీవీవీ దానయ్య.
Comments
Please login to add a commentAdd a comment