
సాక్షి, సినిమా : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రాజెక్టు ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ డబ్బింగ్ చిత్రం అయి ఉండి ఈ ఏడాది బాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన(ఇండియాలో) సినిమాగా బాహుబలి ది కంక్లూజన్ నిలిచింది.
విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న బాహుబలిని మరో భాషలో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. భోజ్‌పురి హీరో దినేష్ లాల్ యాదవ్ నిరాహువా కొత్త చిత్రం బాహుబలి రీమేక్ అన్న సంకేతాలను అందిస్తోంది. వీర్ యోధా మహబలి పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఇక్బాల్ భక్ష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమ్రపాలి దుబేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
తాజాగా దినేష్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇది బాహుబలి రీమేక్ అన్న సంకేతాలను అందిస్తున్నాయి. అయితే దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. భారీగా జూనియర్ ఆర్టిస్టులు, గుర్రాలు, వార్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. జనవరి 15న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తారంట.
Comments
Please login to add a commentAdd a comment