బాహుబలిని దాటేసిన హర్రర్ సినిమా
'ఐటీ' అంతగా అంచనాలు లేకుండా హాలీవుడ్‌లో రిలీజైన ఓ హార్రర్ చిత్రం. నేటితో ఈ చిత్రం విడుదలై ఐదు రోజులు అవుతోంది. బాహుబలి, దంగల్ సినిమాల రికార్డు కలెక్షన్లను నాలుగు రోజుల్లో దాటేసింది. అంతలా ఈ చిత్రంలో ఏం ఉంది మరి. ఇప్పటివరకూ హాలీవుడ్ అద్భుత హారర్ చిత్రాల్లో 'ఐటీ' ముందు వరుసలో ఉంటుందని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
1986లో విడుదలైన ఐటీ పుస్తకం ఆధారంగా స్టోరీ లైన్‌ను తీసుకుని తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐటీ పుస్తకాన్ని రాసింది స్టీఫెన్ కింగ్.. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆండ్రెస్. హర్రర్ చిత్రాల ప్రేమికులకు ఈ సినిమా కనువిందు అనే టాక్ కూడా ఉంది. ఈ చిత్ర ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి మరి.