stephen king
-
స్టీఫెన్ కింగ్
‘కింగ్ ఆఫ్ హారర్’ అని పిలుస్తారు అమెరికా రచయిత స్టీఫెన్ కింగ్(జననం 1947)ను. అతడికి రెండేళ్లున్నప్పుడు, సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్లినట్టుగా ఇంట్లోంచి బయటకు వెళ్లి, అటే పోయాడు కింగ్ తండ్రి. స్టీఫెన్ తన చిన్నతనంలోనే రైలు ఢీకొట్టి చనిపోయిన స్నేహితుడిని చూశాడు. బహుశా జీవితంలోని చీకటి పట్ల ఆకర్షితుడవడానికి ఇవి కారణం అయివుండాలి. అలాగని హారర్ మాత్రమే రాయలేదు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, డ్రామా తరహాగా కూడా రాశాడు. 58 నవలలు, 200 కథలు, 6 నాన్ఫిక్షన్ పుస్తకాలు వెలువరించాడు. ‘ద షైనింగ్’, ‘ద షాషాంక్ రెడెంప్షన్’, ‘ద గ్రీన్‌మైల్’, ‘డోలరస్ క్లేబోర్న్’, ‘ద డార్క్ టవర్’, ‘స్టాండ్ బై మి’, ‘ఇట్’, ‘ద మిస్ట్’, ‘మిజెరీ’ లాంటి పదులకొద్దీ హాలీవుడ్ చిత్రాలకు స్టీఫెన్ కింగ్ రచనలే ఆధారం. మరొకటి ఏదీ చేతకాకపోవడమే తాను రచయిత అవడానికి కారణం అని చెబుతాడు. నాలుగు నుంచి ఆరు గంటలు చదవడం, రాయడం కోసం కేటాయిస్తాడు. సుమారు రెండు వేల పదాలైనా రాయకుండా నిద్రపోకూడదనేది ఆయన పాటించే క్రమశిక్షణ. నువ్వు రాసిందానికి చెక్కు గనక వచ్చి, ఆ డబ్బుతో నువ్వు కరెంట్ బిల్లు కట్టగలిగావంటే నువ్వు ప్రతిభావంతుడికిందే లెక్క, అంటాడు. -
బాహుబలిని దాటేసిన హర్రర్ సినిమా
'ఐటీ' అంతగా అంచనాలు లేకుండా హాలీవుడ్లో రిలీజైన ఓ హార్రర్ చిత్రం. నేటితో ఈ చిత్రం విడుదలై ఐదు రోజులు అవుతోంది. బాహుబలి, దంగల్ సినిమాల రికార్డు కలెక్షన్లను నాలుగు రోజుల్లో దాటేసింది. అంతలా ఈ చిత్రంలో ఏం ఉంది మరి. ఇప్పటివరకూ హాలీవుడ్ అద్భుత హారర్ చిత్రాల్లో 'ఐటీ' ముందు వరుసలో ఉంటుందని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 1986లో విడుదలైన ఐటీ పుస్తకం ఆధారంగా స్టోరీ లైన్‌ను తీసుకుని తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐటీ పుస్తకాన్ని రాసింది స్టీఫెన్ కింగ్.. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆండ్రెస్. హర్రర్ చిత్రాల ప్రేమికులకు ఈ సినిమా కనువిందు అనే టాక్ కూడా ఉంది. ఈ చిత్ర ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి మరి. -
అతడు కింగ్, ఆమె క్వీన్..!
నీ వల్లే... నీ వల్లే... స్టీఫెన్కింగ్... ఆంగ్లభాషను సుసంపన్నం చేసిన రచయితల్లో ఒకరు. ప్రధానంగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలను బేస్ చేసుకొని సామాజికమైన అంశాల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి అద్భుతమైన స్థాయి రచనలను ఆవిష్కరించిన రచయిత కింగ్. ఆయన రచనల్లో అద్భుతమైన స్ఫూర్తి ఉంటుందని అంటారు అభిమానులు. కింగ్ రచనల్లోనే కాదు, ఆయన జీవితంలో కూడా కావాల్సినంత స్ఫూర్తి ఉంది. భార్య తబితతో కలసి సాగిస్తున్న దాంపత్యంలో కూడా ఎంతో స్ఫూర్తి ఉంది. ఒక మగాడి ఔన్నత్యాన్ని ప్రపంచమంతా ప్రశ్నించినా అండగా నిలబడగలిగేది భార్య మాత్రమే అనే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు కింగ్, తబితలు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన కింగ్... లాండ్రీ వ్యాన్‌లో పనిచేసేవాడు. కింగ్ సంపాదన చాలక తబిత కూలి పనులు చేసేది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కింగ్ రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. కానీ పబ్లిషర్స్ నుంచి వచ్చే ప్రతిస్పందనలు నిరుత్సాహపరిచేవి. అమెరికాలో నవలలకు మంచి క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో కూడా ఏ ఒక్క పబ్లిషరూ కింగ్ రచనలను ప్రచురించడానికి ముందుకు రాలేదు. పబ్లిషర్స్ వెనక్కు పంపిన మ్యాన్యూస్క్రిప్ట్లను చూసి కింగ్ విసుగెత్తిపోయేవాడు. అలాంటప్పుడు అతడిని ఊరడించే బాధ్యతను తీసుకొంది తబిత. నవల తిరిగివచ్చినప్పుడల్లా భార్య అతడి పాలిట పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయింది. ఒకసారి తిరిగి వచ్చిన నవలను రోడ్డు మీదున్న చెత్తకుండీ దగ్గర పడేశాడు కింగ్. తబిత తెల్లారాక చెత్తకుండీ దగ్గర ఉన్న నవలను తెచ్చి ‘పట్టు వదలవద్దని’ బోధించింది. ఆమె ఇచ్చిన ప్రేరణతో కింగ్ మళ్లీ కలం చేతబట్టాడు. ఈసారి పబ్లిషర్ నుంచి 50 వేల డాలర్ల చెక్ వచ్చింది! ఆ నవలే ‘కేరీ’. 1976లో పబ్లిష్ అయిన ఈ నవల సినిమాగా కోట్ల డాలర్లు వసూలు చేసింది. తబిత భర్తను రచయితగా తీర్చిదిద్దుకొంది. అతడిని ‘కింగ్’ గా నిలిపిన క్వీన్ ఆమె! - జీవన్