బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి.. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే సమయంలో ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కించటమే తన జీవితాశమని రాజమౌళి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించాడు రాజమౌళి.
అయితే రాజమౌళి సినిమా పనులు మొదలు కాకముందే మరిన్ని మహాభారతాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో రంథమూలం నవల ఆధారంగా 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు, ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న థగ్ ఆఫ్ హిందుస్తాన్ పనులు పూర్తయిన వెంటనే మహాభారతంలో తొలి భాగాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అధ్వైత్ దర్శకత్వంలో తొలి భాగం తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ లో ఆమిర్ కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment