
సాక్షి, హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభలో రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించగా.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రేవంత్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందన్న వర్మ.. రేవంత్ ఎలక్షన్ బాహుబలి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ లో చేరనున్న రేవంత్ రెడ్డి టీడీపీకి, పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
'రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు' అంటూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం నిర్వహించిన సభలో రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జాతీయ స్థాయిలో రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేద్దామంటూ తన అభిమానులకు, మద్ధతుదారులకు రేవంత్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment