
నిషేదం తరువాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫాంలో దూసుకుపోతున్నాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ తరుపున ఆడుతున్న వార్నర్ తాజాగా టీం మెంబర్స్‌తో కలిసి ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ స్టార్ క్రికెటర్. యాక్టింగ్ కెరీర్‌గా ఎంచుకునే ఆలోచన ఉందా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాహుబలి అంటూ సమాధానం ఇచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై బాహుబలి చిత్రయూనిట్ స్పందంచింది. ‘హేయ్ డేవిడ్ వార్నర్.. మేం విన్నాం. మీరు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు..? బాహు వైపా.. భల్లా వైపా? బాహుబలి 3 షూటింగ్‌కు సిద్ధంకండి’ అంటూ బాహుబలి మూవీ అఫీషియల్ ట్విటర్ పేజ్ నుంచి రిప్లై ఇచ్చారు.
Hey, @davidwarner31. We have listened 😁
— Baahubali (@BaahubaliMovie) 2 April 2019
Whose side do you want to take?? Baahu or Bhalla?? Be prepared for the #Baahubali3 Shoot! 😉
Best wishes for the rest of #IPL. Keep hitting hard 🏏 https://t.co/ZWCUbDQVYk
Comments
Please login to add a commentAdd a comment