
బాహుబలిలో నటించటం గ్రామానికే గర్వకారణం
ప్రజాదరణ పొందిన బాహుబలి చిత్రాల్లో ఎ.వేమవరం గ్రామస్తుడు జార్జి నటించటం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ కనపాల స్వర్ణకుమారి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజాదరణ పొందిన బాహుబలి చిత్రాల్లో ఎ.వేమవరం గ్రామస్తుడు జార్జి నటించటం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ కనపాల స్వర్ణకుమారి అన్నారు. బాహుబలి, బాహుబలి–2 సినిమాలలో చిన్న పాత్రల్లో నటించిన గ్రామస్తుడు దేవా బత్తుల జార్జిని శుక్రవారం రాత్రి స్థానిక దళిత పేటలో ఘనంగా సన్మానించారు. యూనియన్ బ్యాంకు మేనేజరుగా పని చేసి రిటైర్ అయిన జార్జి హైదరాబాదులో స్థిరపడ్డారు.
ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన బాహుబలి రెండు సినిమాలలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, తనకు జరిగిన సన్మా నం పట్ల గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు గుత్తుల నాగమణి, వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోశెట్టి లీలాసుబ్బారావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బీకే సత్యనారాయణ, టీడీపీ నాయకుడు డి.నాగార్జున, బీజెపీ మం డల నాయకుడు మాధవశర్మ, మాజీ ఉప సర్పంచ్ సదమళ్ల తాతబ్బాయ్, మాలమహానా డు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు.