రాజమౌళి నెక్ట్స్ అతనితోనే..!
బాహుబలి సినిమాతో సంచలనాలు సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి నెక్ట్స్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడన్న చర్చ జరుగుతోంది. స్టార్ హీరోలందరూ రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నా.. రాజమౌళి మనసులో ఎవరున్నారో మాత్రం ఇంత వరకు వెల్లడించలేదు. బాలీవుడ్ సినిమా చేస్తాడంటూ, అల్లు అర్జున్తో చర్చలు జరుగుతున్నాయని, నానితో ఈగ 2 మొదలవుతుందని రకరకాల వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్లు సాధించిన కాంబినేషన్కే జక్కన్న మొగ్గుచూపుతున్నాడట. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలతో సూపర్ హిట్లు సాధించిన ఎన్టీఆర్తో మరోసారి కలిసి పనిచేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాతో పాటు బిగ్ బాస్ టీవీ షోలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో రెండు నెలల్లో ఖాళీ కానున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేస్తాడన్న టాక్ వినిపించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. దీంతో జక్కన్నతోనే నెక్ట్స్ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా రాజమౌళి, ఎన్టీఆర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ఎన్టీఆర్ రాజమౌళి ఓటేస్తున్నాడట. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.