
తెలుగు పాట రాసిన తమిళ రచయిత
బాహుబలి సినిమా కోసం ప్రత్యేక కిలికిలి భాషను సృష్టించిన ఘనత తమిళ రచయిత మదన్ కర్కీదే.
బాహుబలి సినిమా కోసం ప్రత్యేక కిలికిలి భాషను సృష్టించిన ఘనత తమిళ రచయిత మదన్ కర్కీదే. స్వతహాగా తమిళ గేయ రచయిత అయిన మదన్ బాహుబలి సినిమా కోసం ఓ భాషను తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించనున్నాడు ఈ యంగ్ రైటర్. ఇతర భాషల్లో మాట్లాడటమే కష్టం అలాంటి మదన్ ఏకంగా పరాయి భాషలో పాట రాశాడు.
మురుగదాస్ దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాతో తెలుగును గేయ రచయితగా పరిచయం అవుతున్నాడు మదన్ కర్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Penned my first Telugu song for @urstrulyMahesh’s #Spyder. Big thanks to Director @ARMurugadoss & @Jharrisjayaraj for trusting in me.
— Madhan Karky (@madhankarky) 18 August 2017