బాలీవుడ్ బడా నిర్మాత చేతికి స్పైడర్..? | Mahesh babu Spyder hindi distribution by karan johar | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బడా నిర్మాత చేతికి స్పైడర్..?

Published Sat, Jun 3 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

బాలీవుడ్ బడా నిర్మాత చేతికి స్పైడర్..?

బాలీవుడ్ బడా నిర్మాత చేతికి స్పైడర్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ స్పైడర్ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన టీజర్పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాజిటివ్గా స్పందించారు. తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటం వెనుక కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. స్పైడర్ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. స్పైడర్ యూనిట్ కూడా కరణ్ బ్యానర్లో రిలీజ్ అయితే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తోంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న స్పైడర్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement