
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ రావటంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్ సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment