Prabhas
-
ప్రభాస్ కి భయపడని చిన్న హీరోలు
-
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
ప్రభాస్ నంబర్ వన్ ... సమంత హ్యాట్రిక్
రికార్డ్ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహించి, టాప్ ΄పోజిషన్లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబరు నెలకుగాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించగా హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సమంత తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు... కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడో సారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.ప్రభాస్ వరుసగా రెండో సారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే... సమంత తొలి స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచి, హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించారు సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ జాబితాలో సమంత తర్వాతి ప్లేస్‌లలో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మికా మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. -
స్పిరిట్‌లో..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్... ఎందుకంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.జపాన్ భాషలో సారీ చెప్తూ..అంతేకాదు, జపాన్ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. గాయం వల్లే..జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నాడు.కల్కి సినిమా సంగతులుకల్కి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (హిందీ వర్షన్)లో అందుబాటులో ఉంది.#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥- https://t.co/mLRYxxFLXl#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/CYdG1kmTmm— Kalki 2898 AD (@Kalki2898AD) December 18, 2024//#カルキ2898ADジャパンプレミア実況🏹\\TOHOシネマズ六本木ヒルズ 無事終了いたしました✨次は、19:00〜新宿ピカデリーにて!🔥#カルキ2898AD来日譚 pic.twitter.com/YIEbOzkhF6— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 18, 2024చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ -
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడ్డట్లే
లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
స్పిరిట్ మూవీలో ప్రభాస్ తో సీత రొమాన్స్
-
అల్లు అర్జున్ విషయంలో ప్రభాస్, శ్రీలీల రియాక్షన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్ధతుగా చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే స్పందించారు. ఈ క్రమంలో కొందరు బన్నీ ఇంటికే కూడా వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. తాజాగా ప్రభాస్ తన స్నేహితుడు అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వీరిద్దరూ 'S/O సత్యమూర్తి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన సినిమా షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. దీంతో బన్నీకి ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ ఇంటికి చాలామంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ, డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.అల్లు అర్జున్ తప్పు చేయరు: శ్రీలీలఅల్లు అర్జున్ అరెస్టుపై నటి 'శ్రీలీల' కూడా రియాక్ట్ అయింది. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని ఆమె చెప్పారు. ఈ ఘటనతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. న్యాయవ్యస్థను ఆయన గౌరవిస్తారు. కాబట్టి అల్లు అర్జున్‌కు మంచి జరిగింది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ భారత పౌరుడిగా మన వ్యవస్థలోని రూల్స్‌ను అందరిలాగే పాటించారు.' అని శ్రీలీల పేర్కొంది. -
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్ ఏదంటే?
తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రద్ధకపూర్ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO— IMDb India (@IMDb_in) December 11, 2024 ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 20241.కల్కి 2898 ఏడీ2.స్త్రీ-23.మహారాజా4.సైతాన్5.ఫైటర్6. మంజుమ్మెల్ బాయ్స్7.భూల్ భూలయ్యా-38.కిల్9.సింగం ఏగైన్10. లపట్టా లేడీస్టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..1. హీరామండి ది డైమండ్ బజార్2. మీర్జాపూర్ సీజన్-33.పంచాయత్ సీజన్-34.గ్యారాహ్ గ్యారాహ్5. సిటాడెల్ హనీ బన్నీ6.మామ్లా లీగల్ హ7.తాజా ఖబర్ సీజన్-28. మర్డర్ ఇన్ మహిమ్9. శేఖర్ హోమ్10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్..
-
లోకేష్ కనకరాజ్-ప్రభాస్ మూవీ ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్..
-
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
‘రాజా సాబ్’ చూడాలంటే.. నా పక్కన ఒకరు ఉండాల్సిందే: నిధీ అగర్వాల్
‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు. ‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది. ‘హరి హర వీరమల్లు’ సెట్లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్. -
‘సలామ్...పోలీస్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్
వెండితెరపై కనిపించే ‘సూపర్ హీరో’ తరహా పాత్రల్లో పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు సమాజం మేలు కోసం ఓ సూపర్ హీరో చేసే అన్ని సాహసాలు పోలీస్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఇలా పోలీసాఫీసర్లకు ‘సలామ్’ కొట్టేలా కొందరు హీరోలు వెండితెరపై పోలీసులుగా యాక్షన్ చేస్తున్నారు. ఆ హీరోలపై కథనం.హుకుమ్...రజనీకాంత్ కెరీర్లో ఈ మధ్యకాలంలో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘జైలర్’ ఒకటి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మేజర్ సీన్స్‌లో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, కొన్ని సీన్స్‌లో పోలీస్ డ్రెస్ వేసుకున్న జైలర్‌గా స్క్రీన్‌పై కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్ 2’కి సంబంధించి రజనీకాంత్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘జైలర్’ సీక్వెల్ అప్డేట్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ‘జైలర్’ సినిమా సీక్వెల్‌కు ‘హుకుమ్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘జైలర్’లోని ‘హుకుమ్’ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాటనే సీక్వెల్‌కు టైటిల్‌గా పెడితే ఆడియన్స్‌కు సినిమా మరింత బాగా రీచ్ అవుతుందని, ‘హుకుమ్’ అనే టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని టీమ్ భావిస్తోందట. కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ పోలీస్ ‘సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్, ఘర్షణ’ వంటి సినిమాల్లో సీరియస్ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ మెప్పించారు. ‘బాబు బంగారం’ సినిమాలో కామిక్ టైమ్ ఉన్న పోలీస్‌గా వెంకీ నటించారు. అయితే ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారాయన (‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి చేసిన రోల్ తరహాలో...) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ కనిపిస్తారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో వెంకీ ఆన్ డ్యూటీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కూడా ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్గానే కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ పోలీస్‌గా... ప్రభాస్ వంటి కటౌట్ ఉన్న హీరో పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. తనను పోలీసాఫీసర్‌గా స్క్రీన్‌పై చూపించే అవకాశాన్ని ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ వంటి సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగా చేతుల్లో పెట్టారు ప్రభాస్. ‘స్పిరిట్’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సీరిస్‌లపై భూషణ్ కుమార్ నిర్మించ నున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. కేసు నంబరు 3 సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి ‘హిట్: ద థర్డ్ కేస్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ‘హిట్ 1, హిట్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కోలనుయే మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు సినిమాలను నిర్మించిన నాని, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం విశేషం. నాని వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది. బంధూక్ హీరో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకుని చాలాసార్లు స్క్రీన్‌పై కనిపించారు. కానీ రియల్ పోలీస్ ఆఫీసర్‌గా కాదు... అయితే ‘బంధూక్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసం విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించి, తుపాకీ పట్టారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామాకు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంపద హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఎస్ఐ యుగంధర్ ఈ మధ్య కాలంలో పోలీసాఫీసర్ రోల్స్‌కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా విడుదలైన గత ఐదు సినిమాల్లో రెండు పోలీసాఫీసర్ సినిమాలు ఉన్నాయి. ఈలోపు మరో పోలీసాఫీసర్ మూవీ ‘ఎస్ఐ యుగంధర్’కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్ఐ యుగంధర్‌గా ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మేఘా లేఖ హీరోయిన్గా నటిస్తున్నారు. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ ఓ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). స్క్రీన్‌పై ఓ పోలీసాఫీసర్‌గా ఈ కేసును పరిష్కరించే క్రమంలో త్రిగుణ్‌కు ఓ టర్నింగ్ ΄ాయింట్ దొరికింది. ఇది ఏంటీ అంటే...‘టర్నింగ్ ΄ాయింట్’ సినిమా చూడాల్సిందే. హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కుహాన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మించారు. ఇలా పోలీసాఫీసర్ రోల్స్‌లో నటించే హీరోలు మరికొంతమంది ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్స్ వింటున్నారని తెలిసింది.– ముసిమి శివాంజనేయులు -
‘కల్కి’లో ఆ పాత్ర చేయమని అడిగితే..నచ్చలేదని తిరస్కరించా : కీర్తి సురేశ్
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక పాత్ర చేయమని నన్ను కోరారు నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.. అందుకే సున్నితంగా తిరస్కరించాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేష్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) వేడుకల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు కీర్తీ సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో నన్ను అడిగిన పాత్రను నేను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు. బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు? అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగి అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది.. ‘బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది’ అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇదిలా ఉంటే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’ (2018). సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రిగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కీర్తి. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తీ సురేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.... తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ని డిసెంబరులో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారామె. -
45 రోజులు వర్షంలో షూటింగ్.. ఆ సినిమా మానేసి వెళ్లిపోదాం అనుకున్నా : త్రిష
‘నా కెరీర్లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు. ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. -
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది.