వినూత్న క్యారెక్టర్‌లు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీ మంచు. ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో అబద్ధాన్ని నిజమని నమ్మే పాత్రలో కనిపిస్తారట లక్ష్మి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ‘ఈగ’, ‘బాహుబలి 1’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విజయ్ యలకంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంగీతం: రఘు దీక్షిత్, కెమెరా: సామల భార్గవ్, మాటలు: సందీప్ గుంటా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుహాసిని రాహుల్.
Comments
Please login to add a commentAdd a comment