బాహుబలి నిర్మాతల భారీ సీరియల్ | baahubali producers tv serial swarna Khadgam | Sakshi
Sakshi News home page

బాహుబలి నిర్మాతల భారీ సీరియల్

Jan 6 2018 12:55 PM | Updated on Mar 22 2019 1:53 PM

baahubali producers tv serial swarna Khadgam - Sakshi

తెలుగు సినిమాగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ వందకోట్లు దాటడమే కష్టంగా ఉన్న సమయంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ.. తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ బుల్లితెర మీద సంచలనాలకు తెర తీసింది.

బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ కోసం సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement