225 కోట్లతో శివాజీ బయోపిక్..! | Riteish Deshmukh all set to play Chhatrapati Shivaji | Sakshi
Sakshi News home page

225 కోట్లతో శివాజీ బయోపిక్..!

Published Thu, May 11 2017 10:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

225 కోట్లతో శివాజీ బయోపిక్..!

225 కోట్లతో శివాజీ బయోపిక్..!

బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతలు భారీ చిత్రాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఎనౌన్స్ కాగా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేశారు మరాఠా మేకర్స్. మరాఠా యోదుడు శివాజీ కథతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. 225 కోట్ల బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, రితేష్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ' బాహుబలి మెరుపుల తరువాత, మరో గొప్ప వార్త.. రితేష్ దేశ్ముఖ్ 225 కోట్ల బడ్జెట్తో శివాజీ సినిమాను రూపొందించటం. బాహుబలి కన్నా శివాజీ కథలో గొప్ప హీరోయిజం, డ్రామా ఉంటుంది. భరత మాత ముద్దుబిడ్డగా శివాజీ కథ అందరికీ బాగా తెలిసిన కథ, ఈ కథలోని యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. గొప్ప సినిమాను రూపొందిస్తున్నందుకు రితేష్కు కృతజ్ఞతలు. బాహుబలి తెలుగు వారికి ఎలాగో, మరాఠిలకు శివాజీ అలా నిలిచిపోయే చిత్రంగా రితేష్ రూపొందిస్తున్నాడు.' అంటూ ట్వీట్ చేశాడు.

రితేష్.. చాలా కాలంగా శివాజీ కథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రితేష్ స్వయంగా శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బడ్జెట్ పరంగా వర్క్ అవుట్ కాదన్న అనుమానంతో ఇంత కాలం ఈ ప్రాజెక్ట్ను వాయిదా వేస్తూ వచ్చారు. బాహుబలి ఘనవిజయం సాధించటంతో శివాజీ బయోపిక్ మరోసారి తెర మీదకు వచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement