కండలు తిరిగిన భారీకాయంతో ’బాహుబలి’గా ప్రభాస్ అలరించాడు.
కండలు తిరిగిన భారీకాయంతో ’బాహుబలి’గా ప్రభాస్ అలరించాడు. చరితాత్మక విజయాన్ని సాధించిన ఈ దృశ్యకావ్యం ద్వారా దేశమంతటా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ప్రభాస్‌కు పెద్ద ఎత్తున లేడీ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ’బాహుబలి’ లాంటి సూపర్ బంపర్ హిట్ తర్వాత లో ప్రొఫైల్‌ను కంటిన్యూచేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ’సాహో’ చిత్రంలో కనిపిస్తున్నాడు.
బాహుబలి అవతారానికి పూర్తి విరుద్ధంగా కంప్లీట్ న్యూ యంగ్‌లుక్‌తో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ’సాహో’ చిత్రంలో ప్రభాస్ తాజా హ్యాండ్‌సమ్ లుక్‌ను సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తాజాగా ట్వీట్ చేశారు. టాప్ యాంగిల్‌లో తీసిన ఈ ఫొటోలో ప్రభాస్ కిందకు చూస్తూ ఒకింత సిగ్గుపడుతూ నవ్వుతూ యంగ్ లుక్‌తో అదరగొట్టాడు. ఆరెంజ్ కలర్ రౌండ్‌నెక్ టీ షర్ట్ ధరించి.. దానిపై మెడ చుట్టూ చెక్ షర్ట్ వేసుకొని ఉన్న ఈ ఫొటో ఇప్పటికే అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది.
A latest pic of Handsome #Prabhas