నటుడి చెంప వాయించిన 'బాహుబలి' నటి | Baahubali fame Scarlett Wilson slaps an actor in movie set | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 2 2017 7:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన సహ నటుడి చెంప చెళ్లుమనిపించారు నటి స్కార్లెట్ విల్సన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన 'బాహుబలి' పార్ట్ 1లో 'మనోహరీ..' అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో స్కార్లెట్ ఆడిపాడారు. ప్రస్తుతం స్కార్లెట్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హన్సా-ఏక్-సన్యోగ్'. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం షూటింగ్ జరుగుతోంది. అయితే నటి స్కార్లెట్ తో సహ నటుడు ఉమాకాంత్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇలాంటి పనులు చేయవద్దని స్కార్లెట్ హెచ్చరించినా పట్టించుకోని ఉమాకాంత్.. అసభ్యకర సంకేతాలు పంపుతూ ఆమెను తాకాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె వెంటనే అతడి చెంప పగలకొట్టింది. ఈ ఘటనపై స్పందించిన మూవీ యూనిట్ ఉమాకాంత్‌ ను అక్కడి నుంచి పంపేందుకు చూడగా అతడు మరింతగా రెచ్చిపోయాడు. యూనిట్ అతడిని గట్టిగానే వారించి సెట్ నుంచి పక్కకు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement