
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను నీరవ్ మోదీ నిండాముంచిన వ్యవహారంతో బ్యాంక్ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. నీరవ్ స్కాం నేపథ్యంలో పీఎన్‌బీతో తన ఎండార్స్‌మెంట్ కాంట్రాక్టు రెన్యువల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విముఖత చూపుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది చివరి వరకూ కాంట్రాక్టు టర్మ్ ముగియనున్నందున అప్పటివరకూ ఎండార్స్‌మెంట్‌ను తొలగించబోమని కోహ్లీ బ్రాండ్ వ్యవహారాలను చక్కదిద్దే ఏజెన్సీ కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్టును పొడిగించడంపై ఇప్పటివరకూ పీఎన్‌బీతో ఎలాంటి చర్చలూ జరపలేదని సంస్థ సీఈఓ బంటీ సజ్దే చెప్పారు.
అయితే నీరవ్ మోదీ స్కాంలో పీఎన్‌బీని నిందించేందుకు సరైన కారణం లేదని బంటీ పేర్కొనడం గమనార్హం. పీఎన్‌బీ కుంభకోణం నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాత్రం కాంట్రాక్టు పొడిగింపునకు సుముఖత వ్యక్తం చేయరని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment