చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను టార్గెట్ చేస్తూ రిపబ్లిక్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కమలా హారీస్ కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు.
కాగా, వివేక్ రామస్వామి తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కమలా హారీస్ ఓ కీలుబొమ్మ. చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి ఆమె. ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారు. ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువ. అది మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఆమె ఆర్థిక విధానాలు విఫలయమ్యాయి. మేము పాలసీలో గెలుస్తాము.
ఈ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరిక్లను ఎంతో అభ్యంతరకరం. దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. ట్రంప్ విజయం సాధించేందుకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం . సెనేట్ మరియు హౌస్‌పై కూడా మాకు నియంత్రణ ఉంటేనే మేము ఆ ఎజెండాను అమలు చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment