
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇక, బాధ్యతల్లో చేరకముందే వివేక్ రామస్వామి పెద్ద బాంబ్ పేల్చారు. ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని హింట్ ఇచ్చారు.
ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్‌మస్క్ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, ముందు నుంచి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే నినాదం చేస్తున్న విషయం తెలిసిందే.
Vivek Ramaswamy on a mission.#MAGA pic.twitter.com/wYivstPqDV
— TheTrumpestFuture (@trumpestfuture) November 16, 2024