చెన్నై: సెల్‌ఫోన్ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది.
ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రమణియన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours.
— ANI (@ANI) March 15, 2022
Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J
Comments
Please login to add a commentAdd a comment