ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమి ట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోందట! మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది.
ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ కథనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment