![106 Government Employees Suspended In Siddipet District - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/9/election-commission.jpg.webp?itok=pqzLVtBi)
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment