
ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో డీఏ తీసుకోనున్నారు. డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లిస్తారు.
డీఏ ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు చైర్మన్ కే వెంకట రామిరెడ్డి.
చదవండి:
పింఛన్.. ఏపీలోనే మించెన్
బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ