కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీ మును ప్రారంభించి అప్పటివరకు ఉద్యోగులకు దీనిని కంపల్స రీ చేయడం జరిగింది. అప్పట్లో వేతనాన్ని నెలకు రూ. 6,000 లుగా లెక్కగట్టి పెన్షన్‌ను నిర్ణయించడంవల్ల రిటైరైన ఉద్యోగులకు పింఛను నెలకు వెయ్యి రూపాయలలోపే వస్తోంది. దీనికి కరువుభత్యంతో అనుసంధానం చేయకపోవడంవల్ల దశాబ్ద కాలంగా ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. కొంత మంది పెన్షనర్లు తమ అవసరాల నిమిత్తం కొంత భాగాన్ని అమ్ముకు న్నారు.
ప్రభుత్వ రూలు ప్రకారం ఈ భాగం తిరిగి పదిహేను సంవత్సరాల తరువాత పెన్షన్‌లో కలసిపోతుంది. కానీ, 95 నాటి ఈపీఎస్ స్కీములో ఉన్నవారికి ఈ రూలు వర్తించదట. అంటే వంద నెలల్లో అమ్మగా వచ్చిన మొత్తం బాకీ తీరిపోగా, వీరు జీవితాంతం కడుతూనే ఉండాలి. మరో విఘాతం ఏమిటంటే, ఈ పెన్షనర్లకు ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ, లేదా బ్యాంకు ఉద్యోగులు.. డిపెండెంట్ల కింద వైద్య సదుపాయం పొందుదామంటే ప్రభుత్వ పెన్షను పొందుతున్నందున వీరు అర్హులుకారట. 1-4-2014 నుండి పెన్షన్‌ను రూ. వెయ్యి చేస్తామన్నారు. మరల 1-9-2014 నుంచి అన్నారు. కానీ రెండు నెలలు గడచినా పెంపు జరగలేదు. 1991లో మొదలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి 2002లో వేలాది ఉద్యోగులను బలవంతంగా వాలంటరీ సపరేషన్ స్కీం కింద తొలగించారు. ఉదాహరణకు అనేక రాష్ట్రాల్లోనున్న ఎరువుల కర్మాగారాలు (నేను రామగుండంలో పనిచేశాను). ఈ సంస్థల్లో 1992, 1997 లో జరగవలసిన వేతన సవరణలను జరపకుండా ఆపివేశారు.
ఆ కారణంగా 1987లో ఉన్న వేతనాలమీద 2002లో వి.ఎస్.ఎస్ కింద కొంత అదనంగా కలిపి పంపించి వేశారు. ఈ విధంగా కూడా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఈపీఎస్-95 పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఏ ఉద్యోగం చేయకపోయినా వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు బాగా పెంచారు. దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినవారిని విస్మరిస్తున్నారు. 2002లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నదీ బీజేపీ ప్రభుత్వమే. ఆవేదనతో రాసిన ఈ లేఖ చూసైనా మా ఈపీఎస్-95 పెన్షనర్లకు 1-1-2015 నుంచి నెలసరి పెన్షన్ను రూ. 7,500 లు (ప్రభుత్వం నిర్ణయించిన మినిమమ్ వేతనం 15,000 రూ.లను అనుసరించి) ఇస్తూ దీనివి కేంద్రం ఇచ్చే కరువు భత్యానికి అనుసంధానం చేయాలని విన్నవిస్తున్నాను.
- ఎన్.ఎస్.ఆర్.మూర్తి
రిటైర్డ్ ఆఫీసర్, రామగుండం ఎరువుల కర్మాగారం
కొంపముంచిన ఈపీఎస్-95
Published Wed, Dec 17 2014 4:13 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM
Advertisement
Advertisement